New Delhi, June 19: కాంగ్రెస్ పార్టీ నేత (Congress President), సోనియా గాంధీ దివంగత రాజీవ్ గాంధీ ముద్దుల తనయుడు రాహుల్ గాంధీ శుక్రవారం 50వ వడిలోకి (Rahul Gandhi 50th Birthday) అడుగుపెట్టారు. 1970 జూన్ 19న ఆయన జన్మించారు. ఈ సారి ఆయన వేడుకలకు దూరంగా ఉన్నారు. రెండు రకాలుగా దెబ్బ తీసిన కరోనా, కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం అవుతుందని తెలిపిన రాహుల్ గాంధీ, ఇంకా ఎవరేమన్నారంటే..
కరోనా సంక్షోభంతోపాటు లఢక్‌లోని గాల్వాన్ లోయలో చైనా, భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులు కావడంతో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఎలాంటి వేడుకలు జరుపవద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అయితే ప్రజలకు సహాయంగా ఉండాలన్నారు. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
మరోవైపు రాహుల్ గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని కాంగ్రెస్ యవజన సంఘం ఆధ్వర్యంలో అమరులైన జవాన్లకు మౌనంగా నివాళి అర్పించారు. అలాగే పలు చోట్ల కరోనా కిట్లను పంపిణీ చేశారు. వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్రకు చెందిన యూత్ కాంగ్రెస్ పేర్కొంది. ముదిరిన హోమో సెక్సువల్ రాజకీయం, రాహుల్ స్వలింగ సంపర్కుడు అంటూ స్వామీ చక్రపాణి తీవ్ర వ్యాఖ్యలు, వీర సావర్కర్,గాడ్సే స్వలింగ సంపర్కులు అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్
రాహల్ గాంధీకి మంచి జీవితం, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో హోమాన్ని నిర్వహించారు. చైనా వస్తువులను బహిష్కరిస్తామంటూ పార్టీ యువ నేతలు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలుకు దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది.
రాహుల్ గాంధీ గురించి కొన్ని నిజాలు
గాంధీ వంశీకుడు అయిన రాహుల్ గాంధీ జపనీస్ యుద్ధ కళ అయిన ఐకిడో కళను నేర్చుకున్నాడు. బ్లాక్ బెల్ట్ కూడా కలిగి ఉన్నాడు.
రాహుల్ గాంధీ అత్యంత ఇష్టపడే చిరుతిండిలో ఒకటి మోమోస్
గాంధీ ర్వర్డ్ మరియు కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి విద్యను అభ్యసించారు
మాజీ కాంగ్రెస్ చీఫ్ "విపరీతమైన రీడర్" అని మధ్యప్రదేశ్ మాజీ సిఎం దిగ్విజయ సింగ్ తెలిపారు.
నివేదికల ప్రకారం విమానం ఎగరడానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి గాంధీకి కూడా తెలుసు. తన విఐపి విమానం 2018 లో క్లుప్తంగా మిడ్-ఎయిర్ గ్లిచ్‌ను అభివృద్ధి చేసిన తరువాత అతను ప్రశాంతంగా ఉన్నాడు అలాగే"పైలట్ దగ్గర నిలబడ్డాడు" అని పేర్కొన్నారు.
2018 డిసెంబర్‌లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయం తరువాత కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలలోకి అడుగుపెట్టినప్పుడు, గాంధీని 2019 ప్రధానమంత్రి అభ్యర్థిగా చూశారు. అయితే, నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి విజయవంతం కావడంతో పార్టీ అగాధంలోకి కూరుకుపోయింది. అమేథి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి గాంధీ ఓడిపోయారు ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.