Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోదీదంతా బూటకపు ఇమేజ్, ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించిన రాహుల్ గాంధీ, మోదీ బలమే భారత్‌కు అ​తిపెద్ద బలహీనత అంటూ ఎద్దేవా
PM Modi vs Rahul Gandhi (Photo Credits: PTI)

New Delhi, July 21: భారత ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలను (Rahul Gandhi Fires on Modi) సంధించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ సర్కార్‌ వైఫల్యాలపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ (Coroanvirus) కలకలం మొదలైన ఫిబ్రవరి నుంచి మోదీ సర్కార్‌ (Modi Govt) నిర్ణయాలను ట్విటర్‌ వేదికగా రాహుల్ తప్పుపట్టారు. సచిన్ పైలట్‌పై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హైకోర్టులో కొనసాగుతున్న విచారణ, పైలట్ అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపిన న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సంఘ్వి

కోవిడ్-19 కోరలు చాస్తుంటే ప్రధాని మాత్రం.. నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌ నిర్వహణ, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడం​, ప్రజలను కొవ్వొత్తులు వెలిగించాలని కోరడం, అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకోవడం, రాజస్ధాన్‌ సర్కార్‌ను అస్ధిరపరచడం, వంటి చర్యలతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు.

Here's Rahul Gandhi Tweets

ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కరోనావైరస్‌పై పోరాటంలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించిందని కేంద్రం పేర్కొనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ట్రాంగ్‌మేన్‌ ఇమేజ్‌ ఇప్పుడు భారత్‌కు అ​తిపెద్ద బలహీనతగా మారిందని రాహుల్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరులో అసత్యాలు, చైనాతో ప్రతిష్టంభనపై వాస్తవాలను కప్పిపుచ్చడం వంటి చర్యలకు భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు. బీహార్‌లో పేషెంట్ల పక్కనే కరోనా మృత‌దేహం, దేశంలో 24 గంటల్లో 37,418 కోవిడ్-19 కేసులు నమోదు, 11,55,191కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌లో ఓ వీడయోను పోస్ట్‌ చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రాహుల్‌ మోదీని విమర్శించడమే కాక.. చైనా వక్ర బుద్ధిని దుయ్యబట్టారు. వీడియోలో రాహుల్‌ గాంధీ అధికారంలోకి వ‌చ్చేందుకు మోదీ తానో బ‌ల‌వంతుడిన‌న్న బూట‌క‌పు ఇమేజ్‌ను క్రియేట్ చేశార‌ని విమ‌ర్శించారు. కానీ ఇప్పుడు అది భార‌త్‌కు బ‌ల‌హీనంగా మారింద‌న్నారు. మోదీ ప్ర‌తిష్ట‌కు, చైనా ప్ర‌ణాళిక‌ల‌కు ఏ ర‌కంగా సంబంధం ఉంటుందో రాహుల్ త‌న వీడియోలో వివ‌రించారు. యావ‌త్ భూమండ‌లాన్ని చేజిక్కించుకోవాల‌ని చైనా ఎత్తుగ‌డ‌లు వేస్తున్న‌ట్లు రాహుల్ త‌న వీడియోలో ఆరోపించారు.

భౌగోళిక నిర్మాణాన్ని తారుమారుచేయడమే చైనా వ్యూహమంటూ రాహుల్ ఇందులో పేర్కొన్నారు. ‘‘చైనా వాళ్లు ఏది చేసినా దాని వెనుక వ్యూహం లేకుండా ఉండదు. వాళ్ల మనసులో ఇప్పటికే ఓ ప్రపంచ పటాన్ని రూపొందించుకున్నారు. ఇక ఇప్పుడు ప్రపంచ నిర్మాణాన్ని మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాళ్లు ఇప్పుడు చేస్తున్నది అదే. గ్వాదార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ఇవన్నీ చైనా వ్యూహంలో భాగమే...’’ అని రాహుల్ పేర్కొన్నారు.

నరేంద్ర మోదీ సమర్థుడైన నేత అని నిరూపించుకోవాలంటే.. ఆయన తరచూ చెప్పుకునే ‘56 అంగుళాల ఛాతీ’ అనే భావనను కాపాడుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా దీనిమీదనే చైనా ఇప్పుడు దెబ్బకొడుతోంది. ‘మేం ఏది చెబితే అదే మీరూ చెప్పాలి. లేదంటే నరేంద్ర మోదీ బలవంతుడు అనే పేరు మీకు లేకుండా చేస్తాం..’ అని మోదీకి చైనా వాళ్లు చెప్పకనే చెబుతున్నారు..’’ అని రాహుల్ ఆరోపించారు. చైనా వ్యవహారంపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న అని ఆయన అన్నారు.

ఇలాంటి వ్యూహాత్మ‌క స‌మ‌యంలో.. కీల‌క‌మైన గల్వాన్‌, డెమ్చోక్‌, పాన్‌గాంగ్ స‌ర‌స్సుల వ‌ద్ద చైనా త‌న‌ ప్రాభ‌వాన్ని పెంచుకున్న‌ట్లు రాహుల్ తెలిపారు. మ‌న హైవేల వ‌ల్ల చైనీయులు ఇబ్బంది పడుతున్న‌ట్లు చెప్పారు. చైనా.. పాకిస్తాన్‌తో కలిసి క‌శ్మీర్‌లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుందని రాహుల్‌ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు.

ఫిబ్ర‌వ‌రిలో న‌మ‌స్తే ట్రంప్ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశార‌ని, మార్చిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని కూల్చార‌ని, ఏప్రిల్‌లో కొవ్వొత్తుల‌‌ను వెలిగించార‌ని, మే నెల‌లో మోదీ స‌ర్కార్‌కు ఆరేళ్లు నిండాయ‌ని, జూన్‌లో బీహార్‌లో వ‌ర్చువ‌ల్ ర్యాలీ నిర్వ‌హించార‌ని, జూలైలో రాజ‌స్థాన్ స‌ర్కార్‌ను కూల్చేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని మోదీ స‌ర్కార్‌పై రాహుల్ పైర్ అయ్యారు. అందుకే దేశం అంతా క‌రోనా పోరులో ఆత్మ‌నిర్భ‌రంతో ఉంద‌న్నారు.

నాకు నా ఇమేజితో నిమిత్తంలేదు.. సై అంటే సై అని ప్రధానిగా నిరూపించుకుంటారా.. లేక వాళ్ల ముందు మోకరిల్లుతారా?’’ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ ప్రశ్నించారు. ఇవాళ చైనా వాళ్లు మన దేశంలోకి వచ్చి కూర్చున్నా... ప్రధాని మాత్రం వాళ్లు మన భూభాగంలోకి అడుగుపెట్టలేదని బహిరంగంగా చెబుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. ‘‘ఇలా చెప్పడం చూస్తే మోదీ తన పేరు కోసం బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. ఆయన ఇప్పటికే చైనాకి లొంగిపోయారన్న ఆలోచన కలుగుతోంది. ఆయనను ఎలా కావాలంటే అలా ఆడించొచ్చు అని చైనా భావిస్తే... ఇక దేశం కోసం మోదీ ఎంతో కాలం పనిచేయలేరు..’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఓ వైపు చైనాతో ముంచుకొస్తున్న సరిహద్దు వివాదం, మరోవైపు మృత్యు విహారం చేస్తున్న కరోనా మహమ్మారితో కేంద్ర ప్రభుత్వం సతమతమవుతున్న వేళ... రాహుల్ గాంధీ ఈ మేరకు వరుస విమర్శలు చేయడం ఆశ్చర్యపరిచే అంశమే..