Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, July 21: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 తాజా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,55,191కు చేరుకుంది. కోవిడ్-19 భారీనపడి ఒక్కరోజే 587 మంది మరణించారు. కోవిడ్‌-19తో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 28,084 మంది (Coronavirus Deaths) మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక 7,24,578 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,02,529 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించిన ఆక్స్‌ఫర్డ్, ట్వీట్ చేసిన ది లాన్సెట్ ఎడిటర్

మరోవైపు కోవిడ్‌-19 పరీక్షలను ముమ్మరంగా చేపడుతున్నామని సోమవారం 3,30,000కు పైగా శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ (ICMR) పేర్కొంది. జులై 20 వరకూ దేశవ్యాప్తంగా 1,43,81,303 కరోనా టెస్టులు నిర్వహించారని వెల్లడించింది. ఇక ఎన్‌-95 మాస్క్‌ల వాడకంపై ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. వాల్వ్డ్‌ రెస్పిరేటరీలతో కూడిన ఎన్‌-95 మాస్క్‌లను సరిగ్గా వాడకుంటే కరోనా వైరస్‌ సంక్రమణను అడ్డుకోలేరని స్పష్టం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కంటైన్మెంట్‌ విధానాలకు విరుద్ధమని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్‌లో ముందడుగు, హైదరాబాద్‌లో నిమ్స్‌లో మానవులపై తొలి ప్రయోగం, 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో డోస్‌ తీసుకున్న వ్యక్తి

క‌రోనా బాధితుడు మ‌ర‌ణిస్తే అత‌డిని కోవిడ్ (COVID-19) వార్డులోనే గంట‌ల త‌ర‌బ‌డి వ‌దిలేసిన ఘ‌ట‌న బీహార్‌లో చోటు చేసుకుంది. ప‌ట్నాలోని న‌లంద మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రి (ఎన్ఎమ్‌సీహెచ్‌)లో ఆదివారం ఓ క‌రోనా బాధితుడు మ‌ర‌ణించాడు. అయితే అత‌డి మృత‌దేహాన్ని (Corona Dead Body) కోవిడ్ వార్డులోనే వ‌దిలేసి, అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఆ వార్డులో మ‌రో ఏడుగురు పేషెంట్లు ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో సోమ‌వారం ఓ రోగి బంధువు ఆ వార్డును వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మా అమ్మ బెడ్డు ప‌క్క‌నే అత‌ని మృత‌దేహం ఉంది. దీంతో ఆమె ఆదివారం నుంచి తిన‌డ‌మే మానేసింది. ఈ గ‌దిలో ఉన్న‌వారంద‌రూ భ‌యానికి లోన‌వుతున్నారు. మ‌రోవైపు చ‌నిపోయిన వ్య‌క్తిని చాలీచాల‌ని ట‌వ‌ల్‌తో క‌ప్పారు" అని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

అదే అస్ప‌త్రిలోని మ‌రో వార్డులోనూ ఇద్ద‌రు కోవిడ్ పేషెంట్లు మ‌ర‌ణిస్తే వారిని అలాగే వ‌దిలేశార‌ని ఓ రోగి బంధువు సౌర‌భ్ గుప్తా ఆరోపించారు. ఆదివారం నుంచి ఆ వార్డులోకి ఒక్క డాక్ట‌ర్ కూడా వ‌చ్చి చూడలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోగుల‌కు స‌త్వ‌ర వైద్యం అందించ‌ట్లేద‌న్న ఆరోప‌ణ‌లను ఎన్ఎమ్‌సీహెచ్ ప్రిన్సిప‌ల్ డా.హీరాలాల్ మాతో ఖండించారు. వైద్యులు, న‌ర్సులు ఎప్ప‌టిక‌ప్పుడూ రోగులను ప‌రీక్షిస్తూనే ఉన్నార‌ని తెలిపారు. సోమ‌వారం ఐదుగురు మ‌ర‌ణించారని, అయితే బాన్స్ ఘాట్ స్మ‌శాన‌వాటిక‌లో రాత్రి 8 గంట‌ల త‌ర్వాతే అనుమ‌తి ఉండటంతో వారిని అప్ప‌టివ‌ర‌కు బెడ్ల‌పైనే వ‌దిలేశామ‌ని పేర్కొన్నారు. త‌మ ఆస్ప‌త్రిలో మార్చురీ గ‌ది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య (Global Coronavirus) కోటి 48 లక్షలు దాటింది. మొత్తం 1,48,55,107 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,13,248 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 89,07,167 మంది కోలుకున్నారు. బ్రెజిల్‌లో 80వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 39,61,429 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,43,834 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 18,49,989 మంది కోలుకున్నారు.