Jaipur, July 30: గత కొంత కాలం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతున్న రాజస్తాన్ పొలిటికల్ డ్రామాకు (Rajasthan Political Drama) ప్రస్తుతానికి తెర పడింది. ఆగస్ట్ 14 నుంచి అసెంబ్లీ సమావేశాలను (Rajasthan Assembly Sessions) ప్రారంభించేందుకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా (Rajasthan Governor Kalraj Mishra) అంగీకరించారు. ఈ అంగీకారంతో గవర్నర్, కాంగ్రెస్ సర్కార్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ముగిసింది. కాగా జులై 31 నుంచి అసెంబ్లీని ప్రారంభించాలని కోరుతూ సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కేబినెట్ గవర్నర్‌కు పంపిన మూడో సిఫారసును గవర్నర్ వెనక్కు పంపిని విషయం విదితమే. రాష్ట్రపతి రంగంలోకి రావాలి, బీజేపీ నియమించిన గవర్నర్లు రాజ్యాంగాన్ని పదే పదే ఉల్లంఘిస్తున్నారు, రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై స్పందించిన కాంగ్రెస్ నేత చిదంబరం
అసెంబ్లీ సమావేశాల విషయంలో తను కోరిన వివరణలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని, అసెంబ్లీ భేటీలను ప్రారంభించడానికి సహేతుక కారణం పేర్కొంటూ మళ్లీ ప్రతిపాదన పంపాలని గవర్నర్ పేర్కొన్నారు. దాంతో, బుధవారం మళ్లీ సమావేశమైన సీఎం గెహ్లాట్ కేబినెట్.. ఆగస్ట్ 14 నుంచి సమావేశాలను ప్రారంభించాలని కోరుతూ నాలుగోసారి ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. గెహ్లాట్ సర్కారు పంపిన మూడు ప్రతిపాదనలను తిరస్కరించిన గవర్నర్.. ఎట్టకేలకు నాలుగో ప్రతిపాదనను ఆమోదించారు.
అంతకుముందు బుధవారం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజ్‌భవన్‌లో గవర్నర్ మిశ్రాతో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అయితే అప్పటికే మూడో ప్రతిపాదనను కూడా గవర్నర్ తిప్పి పంపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని ఎందుకు సమావేశపర్చాలనుకుంటున్నారో తెలియజేయాలని, లేదంటే 21 రోజుల నోటీసు ఇచ్చి రెగ్యులర్ సెషన్ నిర్వహించాలని సూచిస్తూ గవర్నర్ ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కి పంపారు. గుజరాత్, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్‌భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతూ సాయంత్రం నాలుగో ప్రతిపాదనను తయారు చేసి గవర్నర్‌కు పంపారు. ఈ నెల 25న తొలి ప్రతిపాదన సమర్పించగా.. ఆ రోజు నుంచి 21 రోజులు లెక్క వేసుకొని ఆగస్టు 14 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఓకే చెప్పారు.
మరోవైపు, గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను బుధవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి కలిశారు. కాగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం రాజస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆరుగురు.. ఆ తరువాత 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశామని, స్పీకర్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశామని బీఎస్పీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా తెలిపారు. ఈ పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధ్యక్షతన గురువారం ఉదయం సీఎల్పీ సమావేశం జరగింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ బస చేసిన ఫెయిర్‌మోంట్ హోటల్‌లోనే ఈ సీఎల్పీ సమావేశం జరగింది. ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ సీఎల్పీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.