Hyd, Sep 29: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం స్టాలిన్ తన తనయుడు ఉదయనిధికి కీలక బాధ్యతలు అప్పజెప్పారు. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధిని నియమించారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉడనుంది.
ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆర్.ఎన్.రవి శనివారం ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్‌కు ప్రమోషన్‌తో పాటు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని తిరిగి కేబినెట్‌లోకి తీసుకున్నారు.
గతంలో మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలతో అరెస్టయిన బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయగా రెండు రోజుల క్రితం బెయిల్ వచ్చింది. దీంతో తిరిగి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు స్టాలిన్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్.. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నకోర్టు.. అసలేం జరిగింది?
Here's Tweeet:
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణ స్వీకరణ కార్యక్రమం pic.twitter.com/sp5N4LJXfr
— Telangana Awaaz (@telanganaawaaz) September 29, 2024
ప్రస్తుతం యువజన సంక్షేమం, క్రీడల మంత్రిగా ఉన్న ఉదయనిధికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారని సమాచారం. అన్నాడీఎంకే ప్రభుత్వంలో జయలలిత కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు సెంథిల్ బాలాజీ. ఈ క్రమంలో ఉద్యోగ నియమాకాల్లో సెంథిల్ బాలాజీ అక్రమాలకు పాల్పడ్డారనేది ఈడీ ఆరోపిస్తూ 15 నెలల కిందట ఆయనను అరెస్ట్ చేసింది. ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చారు సెంథిల్. దీంతో తిరిగి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు స్టాలిన్.