Anantapur, December 20: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై (JC Diwakar Reddy) హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ మాదవ్ (YSRCP MP Gorantla Madhav) జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలకు కౌంటర్‌గా అమర పోలీసు బూటును మాధవ్ ముద్దాడారు.
దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని అలాంటి పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకీడ్చారని రాజకీయ సమాధి కట్టారన్నారు. జేసీ మాట్లాడుతుంటే దుర్యోధనుడిలా టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వారని విమర్శించారు.
జేసీ వ్యాఖ్యలకు నిరసనగా పోలీసు బూట్లను స్వయంగా రుమాలుతో శుభ్రం చేసి మీడియా ముఖంగా పోలీసు బూట్లను (police boots) ముద్దాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాలని జేసీ దివాకర్‌రెడ్డికి హితవు పలికారు. రాత్రనక, పగలక ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే పోలీసులపై (police officers) జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని ధ్వజమెత్తారు. తాను పోలీసు అధికారిగా ఉండగా పోలీసులపై దివాకర్‌రెడ్డి చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు స్పందించి తాను మీసం తిప్పితే... ప్రజలు తనను పార్లమెంట్‌కు, జేసీని బజారు పంపించారని చురకలంటించారు.
Here's the Video:
#WATCH: YSR Congress party MP Gorantla Madhav kisses the shoe of a policeman in Anantpuram in protest against TDP's JC Diwakar Reddy's remarks on police. According to reports Diwakar Reddy had earlier said 'will make cops lick my boots after TDP returns' #AndhraPradesh (20.12) pic.twitter.com/VI9sMdyl0N
— ANI (@ANI) December 21, 2019
‘నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీ అయ్యాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యే సత్తా ఉన్నప్పటికీ ఎంతో మంది పోలీసు వ్యవస్థలో పనిచేయాలన్న నిబద్ధతతో అక్కడ కొనసాగుతున్నారు. నేను జస్ట్ ట్రయిల్ చూపించాను. ట్రయిల్ చూపిస్తేనే నేను ఎంపీ అయ్యాను. ఈ విషయాన్ని జేసీ గుర్తించుకోవాల’ని మాధవ్ అన్నారు. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్‌రెడ్డిని ఆయన పక్కనే ఉన్న చంద్రబాబు మందలించకపోడాన్ని ఎంపీ మాధవ్ తప్పుబట్టారు.
ఇప్పటికే జేసీ దివాకర్‌రెడ్డి కథ ముగిసిందని.. ఎన్నికల్లో ఆయన కొడుకు పని కూడా ముగిసిపోయిందన్నారు. అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని.. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జేసీ తన పద్దతి మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు మాధవ్.
పోలీసు వ్యవస్థను కించేపరిచేలా మాట్లాడిన జేసీని ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. జేసీ మాటలు విని చంద్రబాబు (Chandra babu) నవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కర్ణకఠోమైన వ్యాఖ్యలు విని ఎలా నవ్వగలిగారని నిలదీశారు. కాగా, జేసీ వ్యాఖ్యలను రాష్ట్ర, జిల్లాల పోలీసులు సంఘాలు తప్పుబట్టాయి. జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అనంతపురం జిల్లా పోలీస్ సంఘం (అడ్‌హక్ కమిటీ) డిమాండ్ చేసింది.