Rahul Gandhi in Wayanad (Photo Credits: ANI)

Wayanad, December 7: బీజేపీ ప్రభుత్వం(BJP GOVT) మీద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విరుచుకుపడ్డారు. భారతదేశం అత్యాచారాలకు రాజధాని(Rape Capital)గా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌(Wayanad)లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడుతూ.. అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌ ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌న్నారు.

భార‌త్ త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను ఎందుకు సుర‌క్షితంగా చూసుకోవ‌డం లేద‌ని విదేశాలు ప్ర‌శ్నిస్తున్నాయ‌ని రాహుల్ విమ‌ర్శించారు. బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు యూపీ రేప్ ఘ‌ట‌న‌తో లింకుంద‌ని తెలిసినా ప్ర‌ధాని మోడీ (PM Narendra Modi) మాత్రం మౌనం వీడ‌డం లేద‌ని ఆరోపించారు.

ఆరోపణలు ఎదుర్కొనేవారిపై కనీసం చర్యలు కూడా తీసుకోవటంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ లో జరుగుతున్న అత్యాచారాల గురించి తెలుసుకుని ప్రపంచ దేశాల్నీ భారత్ వైపు చూస్తున్నాయన్నారు.

India Has Become Rape Capital of World, Says Rahul Gandhi

దేశ వ్యాప్తంగా మహిళలపై ప్రతీరోజు హింసలు..దారుణాలు జరగుతున్నాయనీ..ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పించటంపై విఫలమైందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. యూపీ(UP)లో ఉన్నావ్ ఘటన(Unnao Rape Case)లో బాధితురాలని పెట్రోల్ పోసి హత్యకు యత్నించిన ఘటనలో చికిత్స పొందుతు బాధితురాలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ఇటువంటి దేశంలో మన అక్కలు చెల్లెళ్లు జీవించటానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరిగిన దిషా ఘటన(Hyderabad Vet Rape-Murder Case)పై స్పందించారు. ఇలా ఒకటీ రెండూ కాదు దేశ వ్యాప్తంగా మహిళలపై జరగుతున్న అత్యాచారాలు..హత్యలు.. అఘాయిత్యాలు..హింసలు ఇలా లెక్కలేనన్ని కొనసాగుతునే ఉన్నాయి.

ఇదిలా ఉంటే యూపీలోని ఉన్నావ్ రేప్ బాధితురాలి ఇంటికి ప్రియాంకా గాంధీ (Priyanka gandhi) వెళ్లారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌ర్వాత ఆమె మీడియా మాట్లాడారు. రాష్ట్రంలో నేర‌స్థుల‌కు చోటు లేద‌ని సీఎం అంటున్నారు, కానీ ఇక్క‌డ జ‌రుగుతోంది వేర‌న్నారు.

Priyanka Gandhi Vadra 

యూపీలో మ‌హిళ‌ల‌కు స్థానం లేకుండా చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని గ‌త ఏడాది కాలం నుంచి వేధిస్తున్నార‌ని, నిందితుల‌కు బీజేపీతో లింకు ఉంద‌ని ప్రియాంకా గాంధీ అనుమానం వ్య‌క్తం చేశారు. అందుకే నేర‌స్థుల‌ను ర‌క్షిస్తున్నార‌ని, నేర‌గాళ్ల‌కు భ‌యంలేకుండా పోయింద‌న్నారు.