రాజస్థాన్‌లోని జైపూర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్ కండక్టర్ దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 75 ఏళ్ల రిటైర్డ్ IAS అధికారి, RL మీనా, రూ. 10 అదనంగా చెల్లించడానికి నిరాకరించినందుకు బస్సు కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. వెంటనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి తన స్టాప్ వచ్చిన విషయాన్ని బస్సు కండక్టర్ తెలియజేయకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి బస్సు ముందుకు వెళ్లింది. బస్సు కండక్టర్‌ను ఘనశ్యాం శర్మగా గుర్తించారు.
కనోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఉదయ్ సింగ్ ప్రకారం, మీనా.. ఆగ్రా రోడ్‌లోని కనోటా బస్ స్టాండ్‌లో దిగవలసి ఉంది, కానీ శర్మ అతనికి తెలియజేయడంలో విఫలమయ్యాడు. బస్సు నైలా వద్ద తదుపరి స్టాప్‌కు చేరుకున్న తర్వాత రూ. 10 అదనంగా డిమాండ్ చేయడం ప్రారంభించాడు. బస్సు కండక్టర్ మీనాను ముందుగా నెట్టివేయడం, ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపించింది.
Bus Conductor Assaults Retired IAS Officer:
A dispute of Rs 10 turned into an ugly fight where a 75 years old retired IAS officer and a bus conductor entered into fight.
This viral video is said to be from Jaipur, Rajasthan.
Who is wrong here ?
Passenger or Conductor ?
— Neetu Khandelwal (@T_Investor_) January 12, 2025
శర్మ రిటైర్డ్ బ్యూరోక్రాట్‌పై దాడి చేయడం ప్రారంభించాడు. శర్మ మీనాను పలుమార్లు కొట్టాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు తరువాత జోక్యం చేసుకుని 75 ఏళ్ల వ్యక్తిపై దాడి చేయకుండా బస్సు కండక్టర్‌ను ఆపడానికి ప్రయత్నించారు. అనంతరం బాధితుడు బస్సు దిగాడు. ఈఘటనపై శనివారం కనోటా పోలీస్ స్టేషన్‌లో బస్సు కండక్టర్‌పై మీనా ఫిర్యాదు చేశారు. అక్రమంగా ప్రవర్తించినందుకు నిందితుడిని జైపూర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సమగ్ర విచారణ జరుగుతోంది.