Amaravathi, November 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఈ మధ్య రాజకీయాస్త్రంగా మారిన ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం ( AP CM YS Jagan Sensational Decision) తీసుకున్నారు.ఈ నిర్ణయంతో అన్ని వార్తలకు ఒకేసారి చెక్ పెట్టారు. ఇసుక కొరతకు కారణమవుతున్న ఇసుక అక్రమ రవాణా (Sand Mafia)పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఇసుక(Sand)ను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు జైలు శిక్ష కూడా అంటూ సీఎం జగన్ కేబినెట్ ఝలక్ ఇచ్చింది .
ఇసుక అక్రమ రవాణాపై సంచలన నిర్ణయం తీసుకుంటూ జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్షకూడా విధించబడుతుందంటూ తీసుకున్న నిర్ణయానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా ఏపీ సీఎం జగన్ ఇసుక వారోత్సవాలపై పలు సూచనలు చేసారు.
14 నుంచి ఇసుక వారోత్సవాలు
ఈనెల 14 నుండి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ఇసుక సరఫరా విషయంలో గతవారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందని,రాబోయే వారం రోజుల్లో సరఫరాను 2లక్షల టన్నులకు పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుండి 180కి పెంచాలని కోరారు. pic.twitter.com/lwq1jo6U5N
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 12, 2019
పట్టణాల్లో అక్రమంగా నిర్మించే లే అవుట్లను క్రమబద్దీకరించేలా కేబినెట్ నిర్ణయిం తీసుకుంది. కనీసం 37 అడుగుల రోడ్డు ఉండేలా లే అవుట్లను క్రమబద్దీకరిస్తామన్నది. లే అవుట్ల విస్తీర్ణం ఆధారంగా పెనాల్టీలు కూడా విధించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.