Andhra Pradesh Formation Day 2021: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ ప్రజలు గట్టి పట్టుదల కలిగినవారని, అందుకే అన్ని చోట్ల రాణిస్తున్నారంటూ ట్వీట్
Prime Minister Narendra Modi addresses the 76th Session of the UN General Assembly at United Nations headquarters in New York (Photo: AP/PTI)

నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నా సోదరీమణులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలతో ప్రసిద్ధి చెందారు. అందుకే అనేక రంగాల్లో రాణిస్తున్నారు. AP ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా మరియు విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని వివరించారు. పుష్కలంగా సహజ వనరులను కలిగిన, ఘనమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రం ఏపీ అని అభివర్ణించారు. ఈ సమయంలో రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములును స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జాతీయ పతకాన్ని ఆవిష్కరిస్తారు. తెలుగు తల్లికి, రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పిస్తారు.

Here's Their Tweets