
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు.
అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా (Telangana) ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో (Andhra Pradesh) విలీనం చేసారు. ఆ తరువాతి కాలంలో హైదరాబాద్ విలీనమైన తరువాత మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: 1970లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979లో విజయనగరం జిల్లా. వీటితో కలిపి మొత్తం 23 జిల్లాలయ్యాయి. 2014 జూన్ 2 న తెలంగాణ వేరుపడటంతో ఇప్పుడు 13 జిల్లాలతో ఏపీ కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం తెలుగు కోట్స్ మీకోసం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు లేటెస్ట్‌లీ తరపున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఈనాటి మన రాష్ట్రం. అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్ర సాధనలో అమరులైన మహనీయులను గుర్తు చేసుకుంటూ..అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు జోహర్లు. అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు