మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు

Eid-E-Milad-Un-Nabi Wishes in Telugu: మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను (Eid Milad Un Nabi) జరుపుకుంటారు. ముస్లింల చాంద్ర మాన క్యాలండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ వారి రబీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు.

మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను (Prophet Muhammad) ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా.. ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్ పండుగను (Milad un-Nab) జరుపుకుంటారు.ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీ. శ. 570లో జన్మించి క్రీ. శ.632 వరకు జీవించి అదే రోజున(తేదీన) కాలధర్మం చేశారు.

ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రకారం, అనంత కరుణామయుడైన అల్లాహ్ విశ్వ శాంతి కోసం మహమ్మద్‌ను ఆఖరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కేవలం ముస్లింలకే కాకుండా, సకల జీవరాశులకు, విశ్వానికి మార్గదర్శకుడని ముస్లింలు నమ్ముతారు.

మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు
మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు
మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలుగులో
అందరికీ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు