Ganesh Chaturthi Wishes: గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అనేది హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందువులు ప్రతి కార్యానికి ముందు గణపతికి మొదట పూజ నిర్వహించడం అనవాయితి, తాము చేయదలిచిన పనులను నిర్విఘ్నంగా జరిగేందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు అందుకుంటారు. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
ఇది పదిరోజుల పాటు వేడుకగా జరిగే పండగ, ప్రతి ఇంట్లో, వాడవాడలా గణేషుడి విగ్రహమూర్తులు ప్రతిష్ఠించి పదిరోజుల పాటు ఘనంగా పూజలు చేసి ఆ మరుసటి రోజు నిమజ్జనం చేస్తారు. 2021లో గణేష్ చతుర్థి పండుగ సెప్టెంబర్ 10 న ప్రారంభమయి, సెప్టెంబర్ 21న ముగుస్తుంది.
ఇక, గణేశుడి ఆరాధన మరియు పూజా సమయాల విషయానికి వస్తే, తొలి రోజు సెప్టెంబర్ 10న ఉదయం 11:03 గంటల నుండి మధ్యాహ్నం 1:33 వరకు గణేష్ చతుర్థి పూజ (ఆరాధన) కొరకు అత్యంత అనుకూలమైన సమయం. చతుర్థి తిథి ఈరోజు ఉదయం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది మరియు రాత్రి 09:57 గంటలకు ముగుస్తుంది.
ఈరోజు వినాయక చవితి సందర్భంగా 'గణపతి బొప్పా మోరియా, మంగళమూర్తి మోరియా' అంటూ జయజయ ధ్వానాలతో ఆ నిర్మలమూర్తిని ఆహ్వానిద్దాం. గణేష చతుర్ధి సందర్భంగా గ్రీటింగ్స్ అందజేస్తున్నాం..
వినాయకుడు మీ జీవితంలోని అన్ని కష్టాలను తీర్చి, అన్ని కోరికలను నెరవేర్చి, మీ యొక్క అన్ని కార్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేలా ఆ భగవంతుని కృపాకటాక్షాలు మీపై సదా ఉండాలని కోరుకుంటూ లేటెస్ట్‌లీ తెలుగు తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు