2050 నాటికి వాటికి చికిత్స చేయడానికి ఉద్దేశించిన మందులకు నిరోధకత కలిగిన ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించే వారి సంఖ్య దాదాపు 70% పెరగవచ్చని ఒక కొత్త అధ్యయనం అంచనా వేసింది, ఇది కొనసాగుతున్న సూపర్‌బగ్ సంక్షోభం యొక్క భారాన్ని మరింత చూపుతోంది. 2050 నాటికి యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ లేదా AMR కారణంగా 39 మిలియన్ల కంటే ఎక్కువ మరణాలను ప్రపంచం చూడగలదు. ది లాన్సెట్ జర్నల్‌లో సోమవారం ఈ అధ్యయనం ప్రచురించబడింది.
బ్యాక్టీరియా, శిలీంద్రాలను చంపేందుకు మనం వాడే యాంటీబయాటిక్స్‌ను ఎదుర్కునే క్రమంలో ఇవి ఏఎంఆర్‌గా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది. అంతేకాదు, సర్జరీ, క్యాన్సర్ ట్రీట్‌మెంట్స్‌ను క్లిష్టతరంగా మారుస్తుంది. మానవులు, జంతువుల్లో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం, దుర్వినియోగమే ఈ భయంకర వాస్తవానికి కారణమన్న విషయం అధ్యయనంలో వెలుగుచూసింది.
తిన్న తర్వాత కూడా మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తుందా.. అయితే కారణాలు ఇవే.
నిజానికి యాంటీమైక్రోబియల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వాటిని కూడా ఎదురొడ్డేందుకు బ్యాక్టీరియా, శిలీంద్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ లీడర్ మోహసేన్ నాగవి పేర్కొన్నారు.చికిత్స లేని సూపర్‌బగ్స్ బారినపడి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్లమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం వుందని పేర్కొన్నారు.
1990 నుంచి 2021 మధ్య ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ (ఏఎంఆర్) కారణంగా 10 లక్షల మంది చనిపోయినట్టు తెలిపింది. ఈ సమస్యను తక్షణం పరిష్కరించకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధ్యయనం ఆందోళన వ్యక్తంచేసింది. ఇవే పరిణామాలు ఇకపైనా కొనసాగితే 2050 నాటికి ఏఎంఆర్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 83 లక్షల కోట్లకు చేరుకుంటుంది. అంతేకాదు, ప్రపంచ జీడీపీ 3.8 శాతం కోల్పోతుంది.