Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirumala, June 27: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను టీటీడీ ఆన్​లైన్​లో విడుదల (TTD Released Seva tickets for September) చేసింది. టికెట్లు పొందిన వారి జాబితాను నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 46,470 టికెట్లలో (TTD, Seva tickets) లక్కీడిప్‌ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయించారు.

లక్కీడిప్‌ టికెట్ల జాబితా వెబ్‌సైట్లో ఉంచినట్లు వివరించారు. జూన్‌ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్‌ టికెట్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కేటాయించిన టికెట్ల జాబితాను జూన్‌ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు.

అమ్మఒడి డబ్బులు అకౌంట్లోకి వచ్చేశాయి, రూ. 6,595 కోట్లను తల్లుల అకౌంట్లలోకి జమ చేసిన ఏపీ ప్రభుత్వం, చదువే నిజమైన ఆస్తి అని తెలిపిన సీఎం జగన్

టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్‌ 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయని తెలిపారు. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 88,613 మంది భక్తులు దర్శించుకోగా 36,153 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.24 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.