 
                                                                 Hyderabad, June 20: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్ (Balkampet) ఎల్లమ్మ (Yellamma) కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కల్యాణం సందర్భంగా ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు.. పార్కింగ్ స్థలాలు
- గ్రీన్ ల్యాండ్, మాతా ఆలయం, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, బీకే గూడ ఎక్స్ రోడ్డు, శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్డు, సనత్‌నగర్, ఫతేనగర్ రోడ్డులోకి మళ్లిస్తారు.
- ఫతేనగర్ ప్లెవోర్ పై నుంచి బల్కంపేట్ ఆలయం వైపు వచ్చే వాహనాలను కొత్త బ్రిడ్జి నుంచి కట్టమైసమ్మ ఆలయం, బేగంపేట్ వైపు మళ్లిస్తారు.
- గ్రీన్ ల్యాండ్, బాకుల అపార్టుమెంట్స్, పుడ్ వరల్డ్ వైపు నుంచి బల్కంపేట్ వైపు వాహనాలను అనుమతించరు, ఈ రూట్‌లో వచ్చే వాహనాలను పుట్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ నుంచి సోనబాయి ఆలయం, సత్యం థియేటర్, మైత్రివనం వైపు పంపిస్తారు.
- బేగంపేట్, కట్టమైసమ్మ ఆలయం నుంచి బల్కంపేట్ వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు, ఈ వాహనాలను గ్రీన్ ల్యాండ్స్, మాత ఆలయం, సత్యం థియేటర్, ఎస్‌ఆర్‌నగర్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- ఎస్‌ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి బల్కంపేట్ వైపు వచ్చే లింక్‌రోడ్డు, బై లేన్లను మూసేస్తారు.
- ఆర్ అండ్ బీ అఫీస్, నేచర్ క్యూర్ హాస్పిటల్, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, పద్మ శ్రీ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ వైపు, ఫతేనగర్ రైల్వే బ్రిడ్జి కింద, పద్మ శ్రీ నుంచి ఆర్ అండ్ బీ వైపు ఉన్న స్థలాలలో పార్కింగ్ చేసుకోవాలి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
