Gold Crown to Kondagattu Anjanna Temple (Credits: X)

Hyderabad, Feb 11: తెలంగాణలోని (Telangana) ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు అంజన్న (Kondagattu Anjanna) ఆలయం ఒకటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. ఇంతటి మహిమాన్విత పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి మూలవిరాట్‌ కు 350 గ్రాముల బంగారంతో కిరీటం, సీతారాముల విగ్రహం, 55 కిలోల వెండితో మకరతోరణం, గర్భాలయ ద్వారాలకు తొడుగులను హైదరాబాద్‌కు చెందిన ఏఎంఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యజమాని మహేశ్వర రెడ్డి-రాధికరెడ్డి దంపతులు విరాళంగా అందించారు. ఆలయంలో ఆభరణాలకు సంప్రోక్షణ అనంతరం సోమవారం వాటిని స్వామివారికి అలంకరించారు.

తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!

ఖర్చు ఎంతంటే??

ఈ బంగారు, వెండి ఆభరణాల తయారీకి దాదాపు ఒక కోటి పది లక్షల వరకూ ఖర్చయినట్లు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా దాత మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సత్కరించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి ప్రసాదం అందించారు.

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు.. ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ.. మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు