Tirumala (File: Google)

Tirupati, Dec 27: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటలకు పైగా సమయం ( Waiting time for devotees) పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,152 మంది భక్తులు దర్శించుకోగా 30,682 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.05కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

భక్తులు అత్యధికంగా సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండోస్థానం.. మొదటి స్థానంలో ఏ పుణ్యక్షేత్రం ఉందంటే??

సర్వదర్శనం భక్తులకు జనవరి 1 నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సర్వదర్శనం భక్తులు టోకెన్‌ పొందిన తర్వాతే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రావాలని వారికే కేటాయించిన సమయానికి కృష్ణతేజా అతిథి గృహం వద్ద క్యూలైన్లులోకి చేరుకోవాలని సూచించారు.

తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ

తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా గల విష్ణు నివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక గల 2,3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ , బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌పల్లి జడ్పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటుచేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.