oppo a59 price slash | Pic: Oppo mobiles official

Oppo A59 Smartphone: మీరు అందుబాటు ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఒప్పో ఇప్పుడు దాని లేటేస్ట్ మోడళ్లపై ధరలను తగ్గించింది. ఒప్పో కొద్దిరోజుల కిందట భారత మార్కెట్లో విడుదల చేసిన Oppo A59 మోడల్ 5G స్మార్ట్‌ఫోన్‌పై సుమారు రూ. 1000 వరకు ధరను తగ్గించింది.

Oppo A59 స్మార్ట్‌ఫోన్‌ 4GB మరియు 6GB అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB వెర్షన్ రూ. 1,000 ధర తగ్గింపుతో ఇప్పుడు రూ. 13,999/- కే లభిస్తుంది. అయితే 6GB వేరియంట్ ధర రూ. 500 డిస్కౌంట్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు Oppo A59 యొక్క 6GB వేరియంట్‌ను ధర తగ్గింపు తర్వాత రూ. 15,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సిల్క్ గోల్డ్, స్టార్రీ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

ఇంకా ఒప్పో ఏ59 స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Oppo A59 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లే

4GB/6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్

వెనకవైపు 13 MP+ 2 MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W SUPERVOOC ఛార్జర్

కనెక్టివిటీ కోసం 5G, డ్యూయల్ SIM స్లాట్,  USB టైప్-C 2.0, OTG, Wi-Fi 802.11 a/b/g/n/ac, డ్యూయల్-బ్యాండ్, ఫింగర్‌ప్రింట్ (సైడ్-మౌంటెడ్)ను కలిగి ఉంటుంది.