CARONAA and COVVIYD-19 (Photo-Twitter)

Anantapur,May 9: ప్రపంచాన్ని కల్లోల పరుస్తున్న కరోనావైరస్ పుట్టుకు గురించి ఇప్పటిదాకా పూర్తి సమాచారం అందుబాటులో లేనే లేదు. మన దేశంలో అయితే అది కొత్త జన్యువులతో రూపాంతరం చెంది దేశ ప్రజలను వణికిస్తోంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే చాలా మంది మరణించారు.

దేశంలోని వైద్యులు 24 గంటల పాటు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుండగా, మరోవైపు కొంత మంది మూఢనమ్మకాలపై కరోనాని తరిమేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కరోనా వైరస్‌ను తమ గ్రామం నుంచి తరిమివేయడం కోసం స్థానిక మహిళలు దేవుడికి భారీ సంఖ్యలో ఊరేగింపు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా అనంతపురంకు చెందిన ఓ వ్యక్తి (Andhra Pradesh-based Man SV Annandd Rao) కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూమారాలజీ ప్రకారం కరోనా, కోవిడ్‌-19 లోని స్పెల్లింగ్‌లో కాస్త మార్పులు చేస్తే కరోనా ఇట్టే మాయమవుతుందని (changing spelling will make COVID vanish) కొత్త రాగం అందుకున్నాడు. ఇంగ్లీషులో కరోనాను ‘CARONAA’ గా కోవిడ్‌ను ‘COVVIYD-19’ మార్చితే మార్పును చూడవచ్చునని తెలిపాడు. అంతేకాకుండా అతడు ఈ విషయాన్ని బ్యానర్‌ ద్వారా తెలిపాడు.

ఇళ్లు, జనావాస ప్రాంతాల్లో కొత్త స్పెల్లింగ్‌తో ఫొటోలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇకపై కరోనా, కోవిడ్ పేర్లను రాసేటప్పడు పైన చెప్పిన స్పెల్లింగ్‌తో రాయాలని చెప్పాడు. అలా చేస్తే అనంతపురంతో పాటు ఈ ప్రపంచం నుంచే కరోనా వెళ్లిపోతుందని పేర్కొన్నాడు.

Here's Story Updates

బ్యానర్ లో ఉన్న దాని ప్రకారం ఈయనపేరు ఎస్.వి.అనంద్ రావు, ఈయన అనంతపురంలోని న్యాయ విభాగంలో స్టెనోగ్రాఫర్. అలాగే  స్థానికంగా న్యూమారాలజిస్ట్‌గా పనిచేస్తుంటాడు ఈ బ్యానర్ లో మరింత సహాయం కోసం తన సంప్రదింపు వివరాలను కూడా పంచుకున్నారు.

గోమూత్రంతో కరోనాని తరిమేయండి, రోజూ పరగడుపున రెండు లేదా మూడు మూత‌ల గో మూత్రం తాగండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వీడియో

కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్‌ ఒకసారి స్పెల్లింగ్‌ మార్పు చేస్తే కరోనా తగ్గిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మరొక నెటిజన్‌ ఎవరి నమ్మకాలు వారివి.. వారు అలా చెప్పారని మనం ఎవరిని కించపరచలేం. మనమైతే కరోనాను జయించడానికి మాస్క్‌ను, భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని తెలిపాడు. ఈ చిత్రం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు. అందరూ తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.