బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆగస్టు నెలలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు వారి వారి ప్రాంతీయ పండుగలను బట్టి 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను తయారు చేస్తుంది.
జాతీయ/రాష్ట్ర సెలవులు, సాంస్కృతిక లేదా మతపరమైన ఆచారాలు, కార్యాచరణ అవసరాలకు సంబంధించిన పనులను పరిగణలోకి తీసుకుని ఈ సెలవులను నిర్ణయిస్తుంది. ఆర్థిక సంస్థలలో పారదర్శకత, సమన్వయాన్ని నిర్ధారిస్తూ, సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను ఆర్‌బీఐ విడుదల చేస్తుంది. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ, పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఏం మాట్లాడారనే చర్చ
ఆగస్టు నెలలో విడుదల చేసిన సెలవుల్లో లోకల్ హాలిడేస్, వీకెండ్స్ కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెలవు జాబితా ప్రకారం... ఈ నెలలో రెండు, నాల్గవ శనివారాలతో పాటు ఆదివారాలు కలిపి మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ శనివారాలలో పనిచేస్తాయి కానీ రెండవ, నాల్గవ శనివారాలు క్లోజ్ అవుతాయి. అయితే 13 రోజుల పాటు సెలవులు అయినప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి. కస్టమర్‌లు వారి తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ఏటీఎంల ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు.
రాష్ట్రాల వారీగా బ్యాంక్ సెలవుల జాబితా
ఆగస్ట్ 3: శనివారం కేర్ పూజ త్రిపుర
ఆగస్ట్ 4: ఆదివారం
ఆగస్ట్ 8: గురువారం టెండాంగ్‌లో రమ్ ఫాత్ సిక్కిం
ఆగస్ట్ 10: శనివారం వీకెండ్ క్లోజ్
ఆగస్ట్ 11,:ఆదివారం
ఆగస్ట్ 13: మంగళవారం పేట్రియాట్ డే మణిపూర్
ఆగస్ట్ 15: గురువారం స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 18: ఆదివారం
ఆగస్ట్ 19: సోమవారం రక్షా బంధన్/ఝులానా పూర్ణిమ/బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు. త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లకు సెలవు.
ఆగస్ట్ 20: మంగళవారం శ్రీ నారాయణ గురు జయంతి కేరళ
ఆగస్ట్ 24 : శనివారం
ఆగస్ట్ 25 : ఆదివారం
ఆగస్ట్ 26 : సోమవారం జన్మాష్టమి/కృష్ణ జయంతి