Cristiano Ronaldo During a Training Session (Photo Credit: X/@AlNassrFC_EN)

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌ వేదికలోకి అరంగేట్రం చేసిన గంటల్లోపే రికార్డు స్థాయి ‘సబ్‌స్క్రిప్షన్స్‌’తో మోత మోగిస్తున్నాడు. బుధవారం (ఆగస్టు 21) యూట్యూబ్‌లోకి ‘యువర్‌ క్రిస్టియానో’ అనే పేరుతో చానెల్‌ను క్రియేట్‌ చేసిన రొనాల్డో.. కేవలం 90 నిమిషాల్లోనే 10 మిలియన్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ (కోటి మంది)ను దాటాడు. యూట్యూబ్‌ చరిత్రలో ఇంత వేగంగా 10 మిలియన్‌ సబ్‌స్ర్కైబర్స్‌ను దాటిన చానెల్‌ మరొకటి లేదు. దీంతో యూట్యూబ్‌ అతడికి ‘గోల్డెన్‌ బటన్‌’ను అందించింది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ ఇదిగో, టీమిండియాను నడిపించనున్న రోహిత్ శర్మ

ఇందుకు సంబంధించిన వీడియోనూ అతడు తన ట్రేడ్‌ మార్క్‌ సెలబ్రేషన్‌ ‘సూ’ను పోలినట్టుగా ‘థాంక్యూ సూ..బ్‌స్ర్కైబర్స్‌’ అని పోస్ట్‌ చేయగా అదీ రికార్డులు బద్దలు కొడుతోంది. తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ చేసిన వీడియోతో యూట్యూబ్‌ అల్లకల్లోలమే అయింది. 12 గంటల్లోనే అతడి సబ్‌స్క్రైబర్లు సంఖ్య ఏకంగా 10 మిలియన్స్‌ (పది కోట్లు) దాటేసింది. యూట్యూబ్‌లో పది కోట్ల సబ్‌స్క్రిప్షన్స్‌ ఉన్న చానెల్‌కు ‘డైమండ్‌ బటన్‌’ను అందజేస్తారు.

ప్రముఖ అమెరికన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, వ్యాపారవేత్త అయిన మిస్టర్‌ బీస్ట్‌ యూట్యూబ్‌లో నమోదు చేసిన రికార్డులన్నీ చెల్లాచెదురవుతున్నాయి. 10 మిలియన్స్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ అయ్యేందుకు బీస్ట్‌కు 132 రోజులు అవసరమైతే రొనాల్డో దానిని కేవలం 12 గంటల్లోనే అందుకున్నాడు. ప్రస్తుతం బీస్ట్‌ను 311 మిలియన్స్‌ (31.1 కోట్లు) మంది అనుసరిస్తుండగా రొనాల్డో (ఇప్పటికే 32 మిలియన్స్‌ దాటింది)