Newdelhi, Oct 14: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వశీలి రతన్ టాటా (Ratan Tata) ఇటీవలే మరణించారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఆయనకు నివాళి అర్పించారు. ఈ క్రమంలో సూరత్ కు చెందిన ఓ నగల వ్యాపారి సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రపటాన్ని (Diamond Portrait) తయారు చేసి నివాళులర్పించారు. ఈ ఫోటోలపై స్పందించిన చాలామంది రతన్ టాటాను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.
ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??
Here's Video:
View this post on Instagram
ఎవరు చేశారు?
గుజరాత్ లోని సూరత్ కు చెందిన విపుల్ భాయ్ అనే వజ్రాల వ్యాపారి రతన్ టాటాకు వినూత్నంగా నివాళులర్పించాలనుకున్నారు. ఈ క్రమంలో సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాట చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ ఉపయోగించారు.