Vijayawada, Oct 14: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త ఇది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు (Liquor Shops) నేడు ఖరారు కానున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీలో భాగంగా 3,396 మద్యం షాపుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి 26 మంది పోటీ పడ్డారు. నేడు డ్రా నిర్వహించనున్నారు. జిల్లాకలెక్టర్ సమక్షంలో షాపులు కేటాయిస్తారు. ఈ నెల 16 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో లిక్కర్ ధరలను మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ.2 లక్షల చొప్పున... 89,882 అప్లికేషన్లకు రూ.1797.64 కోట్ల ఆదాయం సమకూరింది.
ఈ జిల్లాల్లో అత్యధికం
ఈ సారి మద్యం దుకాణాలకు ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ఒక్కో షాపునకు సగటున 52 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ పోటీ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఒక షాప్ కోసం 132, మరో షాప్ కోసం 120 దరఖాస్తులు అందాయి.