Hyderabad Oct 18: మూడు రోజుల క్రితం రెండు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు (Heavy rains lash state) నీట మునిగిపోయాయి. మళ్లీ నిన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. ప్రధాన రహదారులు, గల్లీలు, నాలాలు వరద నీటితో నిండి నదులను తలపించాయి. దాదాపు 50 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు ఏరియాలు నీటిలో (Hyderabad Flooods) మునిగిపోయాయి. మూసీ ఉగ్రరూపం (Musi River) దాల్చింది. చెరువులు పూర్తిగా నుండి పోయి ఉన్నాయి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వరదలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Old videos go viral) మారాయి. వాటిల్లో నిజమెంతో తెలియకుండా సోషల్ మీడియాలో అవి బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేయవద్దని హైదరాబాద్ పోలీస్ శాఖ పౌరులను, నెటిజన్లను హెచ్చరిస్తోంది. భారీ వర్షపాతం మధ్య, హైదరాబాద్ మరియు దాని పొరుగు జిల్లాల నుండి ఇటీవల విజువల్స్ పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.
ఇలాంటి వీడియోలను కొన్నింటిని తనిఖీ చేస్తే అవి ఫేక్ అని తేలాయి. వాటిల్లో ఒకటి హైదరాబాద్ నగరం మీదకు మొసలి వచ్చిందని మరొకటి భువనగిరి పోర్ట అందాలు అన, మరొకటి ద్విచక్ర వాహనాలను రిక్షిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు ఫేక్ అని తేలాయి. వాటిని ఓ సారి పరిశీలిద్దాం.
వీడియో 1
నీటితో నిండిన వీధిలో నుండి వస్తున్న మొసలిని రక్షించినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. అయితే ఇది ఫేక్ అని తేలింది. ఇది 2019లో గుజరాత్ లోని వడోదరకు వరదలు వచ్చినప్పుడు బయటకు వచ్చిన వీడియోగా తేలింది.
#Fakevideo pic.twitter.com/0OCjvdbBY4
— Hyderabad City Police (@hydcitypolice) October 14, 2020
వీడియో 2
ఒక కోట గోడల గుండా వర్షపునీరు భారీగా ప్రవహించే వీడియో వైరల్‌గా ఉంది, ఇది చారిత్రాత్మక భువన గిర్ కోట అని వైరల్ అయింది. అయితే ఇది కూడా ఫేక్ అని తేలింది. జలపాతం యొక్క రెండవ వీడియో తెలంగాణలోని జనగాం జిల్లాలోని Zaffergadh hill నుండి వచ్చింది. వీడియో కనీసం ఒక నెల పాతది.
This is not at #Bhongirfort. This video was shot at Zaffergadh hill, #Jangaon. And it was shot in August -2020 , not in the past a few days. Don't rush to #Bhongir to watch the spectacle pic.twitter.com/0eoHqu4cu5
— Mahesh_TNIE (@maheemahesh25) October 13, 2020
మూడవ వీడియో
కొంతమంది యువకులు వరదనీటిలో నుంచి ద్విచక్ర వాహనాలు లాగడం చూసే మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. హైదరాబాద్ నగరంలో మౌళిక సదుపాయాలు లేవని, ఆక్రమణలతో స్థలాలన్నీ కబ్జాలకు గురయ్యాయయని దాన్ని వైరల్ చేశారు. అయితే ఇది కూడా ఫేక్ అని తేలింది. అయితే ఇది ఇప్పుడుది కాదని 2019లో వచ్చిన వరదలకు ఉస్మాన్‌గంజ్ ప్రాంతంలోని మొజమ్‌జాహి మార్కెట్ వద్ద వరదల్లో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా మంది ప్రజలు కూడా కొట్టుకుపోయారని తేలింది.
మూసీ నది మళ్లీ ఉగ్రరూపం
వైరల్ వీడియోల సంగతి అలా ఉంచితే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను మూసీ ముంచేసింది. 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చదర్‌ఘాట్ నుండి మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్ ప్రధాన రోడ్ బంద్ అయింది. ఆ పక్కనే ఉన్న బస్తీలు మొత్తం నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాయకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ వచ్చి తమని చూడలేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిమాయత్ సాగర్ జల కళను సంతరించుకుంది. రాత్రి కురిసిన వర్షానికి నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 5 అడుగుల మేర 12 గేట్లను ఎత్తి వేశారు. ఇక గండి పేటకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశం ఉంది.
అనవసరంగా రోడ్లపైకి రాకండి : సీపీ అంజనీ కుమార్
‘‘రాత్రి కురిసిన వర్షానికి పాత బస్తీలో చాలా ప్రదేశాల్లో వరద నీరు చేరింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులను అలర్ట్ చేశాము. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాము. పాత బస్తీలోని ఫలక్‌నామా బిడ్జ్‌పైన ఆరు అడుగుల గొయ్యి పడింది. దీంతో మొత్తం ట్రాఫిక్ డైవర్సన్ చేశాము. జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వరద ప్రాంతాల్లో ఉన్నవారిని రెస్క్యూ చేస్తున్నాం. అనవసరంగా ఎవరూ కూడా రోడ్లపైకి వాహనాలు తీసుకొని రాకండి. ఇంకా మూడు రోజులు పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి కోరుతున్నా’’మని సీపీ అంజనీ కుమార్ అన్నారు.