Representational Image (Photo Credits: Pixabay)

ఫ్రాన్స్ లో ఉన్న ఓ వ్యక్తికి వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు వల్ల (alleged hospital errors) అతను తన మర్మాంగాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి పరిహారంగా రూ. 54 లక్షలు చెల్లించింది. 2014లో  నాంటెస్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది.

అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అతడి వయస్సు 42 ఏళ్ళు. అప్పుడు అతనికి పెళ్లి కూడా అయింది.అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది.

మై సెకండ్‌ వైఫ్‌ రెస్టారెంట్‌, ఇక్కడ రెండో పెళ్లి చేసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వబడును, హోటల్ కథేంటో చూద్దామా..

అయితే వైద్యులు అతని టిష్యూల నుంచి క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్ల వల్ల క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. దీంతో భరించలేని నొప్పితో అతను కొద్ది రోజుల పాటు నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో నొప్పి భరించలేక కట్టర్‌తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. రానురాను అతనికి క్యాన్సర్ తీవ్రత పెరిగి మొత్తం మర్మాంగానికి అది సోకింది.

ఎమోషనల్ వీడియో అంటే ఇదే, ఐసీయూలో ఉన్న తల్లి చివరి కోరికను నెరవేర్చిన కూతురు, ఆమె ముందే యువకుడితో పెళ్లి, దంపతులను దీవించి తుదిశ్వాస విడిచిన తల్లి

ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా (removal of his genitals) తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా (French Man awarded Rs 54 lakh compensation) ఇచ్చింది.