Gurugram Shocker: ఖర్చులకు డబ్బులు లేవని భర్త కిడ్నాప్ నాటకం, రూ 2 లక్షలు అకౌంట్లో వేయాలని భార్యకు మెసేజ్, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాక్
Representative Image

Gurugram, Jan 5: గురుగ్రామ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త రెండు లక్షల కోసం భార్య వద్ద కిడ్నాప్ నాటకం (Man fakes his own kidnapping) ఆడాడు. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి డ్రామా బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ సమీపంలోని హర్యానాకు చెందిన గురుగ్రామ్‌ రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే దీపిక ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అనూప్‌ యాదవ్‌ను సిటీ క్లబ్‌ నుంచి ఎవరో కిడ్నాప్‌ చేశారని, క్షేమంగా విడిచిపెట్టేందుకు రెండు లక్షలు డిమాండ్‌ చేసినట్లు చెప్పింది.

కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో అనూప్‌ లొకేషన్‌ను గుర్తించారు. మనేసర్‌లో ఉన్న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. తాను స్నేహితులతో విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేశానని, అయితే తన దగ్గర డబ్బు లేదని అందుకే ఈ నాటకం ఆడానని వివరించాడు. అయితే తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని ఊహించలేకపోయానంటూ విచారం వ్యక్తం చేశాడు.

బుల్లీ బాయ్ యాప్ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్, వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు, వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం

ఆమె వద్ద పొదుపు ఉన్నందున డబ్బును బదిలీ చేస్తుందని భావించి ఆమెకు మెసేజ్ చేశాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రీత్ పాల్ సాంగ్వాన్ తెలిపాడు. నిందితుడు గత ఐదేళ్లుగా సెక్టార్ 29లోని బీర్ కేఫ్‌లో పనిచేశాడు. అతను తన స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాలనుకున్నాడు. అయితే అతని దగ్గర డబ్బు లేదు. అందుకే తన అపహరణకు పథకం వేశాడు” అని ఆయన చెప్పారు.

మహిళలను వేలం వేస్తూ..దారుణంగా రాతలు రాస్తూ..ప్రకంపనలు రేపుతున్న బుల్లి బాయ్ యాప్ కేసు, కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న ఉత్తరాఖండ్‌ పోలీసులు

అతను తన కారును ఫైవ్ స్టార్ హోటల్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి, ఆదివారం మధ్యాహ్నం తన కార్యాలయంలోకి నడిచాడని పోలీసులు తెలిపారు. కొన్ని గంటలు గడిపిన తర్వాత, అతను బీర్ కేఫ్ నుండి బయటకు వెళ్లి తన భార్యకు సందేశం (demands ₹2 lakh ransom from wife) పంపాడు. తరువాత తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ప్రీత్ పాల్ సాంగ్వాన్ తెలిపాడు. నిందితుడు కుమార్‌ను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచామని, అతన్ని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపామని చెప్పారు.