Hyderabad, Dec 27: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఆయన అన్నారు. కాగా తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి (Manmohan Singh) ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఒకవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నెరవేర్చారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి సమైక్యవాదులు, నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్ లో ఉన్న ఆయా నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ ధీరోదాత్త ప్రకటన చేయించారు.
మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు pic.twitter.com/ul8KYBo9wc
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2024
తెలంగాణ కోసం ప్రత్యేక సూచనలు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా.. కేసీఆర్ కు, మన్మోహన్ సింగ్ కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్ కు మన్మోహన్ సింగ్ తగిన సూచనలు చేసినట్టు చెప్తారు. అలా తెలంగాణ సాకారమైంది.