Locals Stage Protest by Planting Trees Inside Potholes in Hyderabad. (Photo Credits: ANI)

Hyderabad, November 18:  నగరంలోని రోడ్లపై గుంతల (Potholes) సమస్యను ఎత్తిచూపే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్, పీర్జాడిగూడ ప్రాంతంలోని నివాసితుల బృందం వినూత్న నిరసనను చేపట్టారు. పలుచోట్ల రోడ్లపై ఉన్న గుంతల్లో 'చెట్లను నాటడం' (Planting Trees) ద్వారా అందరి దృష్టిని ఆకర్శిస్తూ తమ సమస్యను తెలియజేశారు. ప్రశాంత్ అనే స్థానికుడు, అతడి స్నేహితులతో కలిసి గుంతలలో చిన్న మొక్కలు మరియు చెట్లను నాటి, వాటికి నీరు పోశారు. వారి ప్రాంతంలో రహదారుల దుస్థితిని ఎత్తిచూపారు.

ఈ సమస్యపై జీహెచ్ఎంసీ (Greater Hyderabad Municipal Corporation) అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా, వారి నుంచి ఎలాంటి స్పందనలేదని స్థానికులు చెప్తున్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. గత సెప్టెంబర్ నుంచి రోడ్లు మరింత అధ్వాన్నంగా తయారయి వాహనదారుల ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ వారు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో గుంతల్లో మొక్కలు నాటి నిరసన తెలుపుతున్నామని స్థానికులు తెలిపారు. భారతదేశంలో డ్రైవ్ చేయడానికి అత్యంత చెత్త నగరం ముంబై, ఆ తర్వాత స్థానంలో..

ఇటీవల కాలంలో సిటిజన్స్ తమ ప్రాంతంలోని సమస్యలను అధికారులు, నాయకులు పట్టించుకోనప్పుడు ఆ సమస్యను అందరి దృష్టికి తేవడానికి క్రియేటివ్ గా ఆలోచిస్తూ, వినూత్నమైన ప్రయ్నత్నాలు చేస్తున్నారు. కొన్నిరోజుల కిందట వర్షాల కార్నంగా దెబ్బతిన్న బెంగళూరు నగర రోడ్ల దుస్థితిని తెలిపేందుకు ఒక పౌరుడు 'వ్యోమగామి' గా వేషధారణ చేసి నగర రోడ్లపై తిరుగుతూ తానున్నది చంద్రమండలంలో కాదు, బెంగళూరు రోడ్లపైనేనని చెపుతూ ఒక ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా అది వైరల్ అయి, నేషనల్ మీడియా దృష్టిని ఆకర్శించారు.