Dhar, Sep 27: దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ లో (MP Covid Vaccination) భాగంగా కొన్ని చోట్ల ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం కికార్వాస్ లో వ్యాక్సినేషన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందికి ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు. ప్రధాని మోదీ స్వయంగా వస్తేనే తాను, తన భార్య టీకా మొదటి డోసు (PM Modi's presence for his vaccination) వేయించుకుంటామని తేల్చి చెప్పాడు. అవాక్కయిన వైద్య సిబ్బంది మరోసారి వచ్చి అతడితో మాట్లాడి టీకా తీసుకునేలా ఒప్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు.
శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. థార్ జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామం కికర్వాస్‌కు టీకా బృందం చేరుకున్నప్పుడు ఈ సంఘటన సంభవించిందని ధార్‌లోని దహి బ్లాక్ వనరుల సమన్వయకర్త మనోజ్ దుబే చెప్పారు.వైరల్ అయిన వీడియో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ బృందం సందేహాస్పద గ్రామస్తుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది.
ఎంపీలో కోవిడ్ -19 నిరోధక టీకాను తీసుకోవాలని గ్రామస్తులను ఒప్పించేందుకు ప్రభుత్వ సిబ్బంది బృందాలు ఇంటింటికీ తిరుగుతున్నాయి. మొదటి డోస్‌తో అర్హులైన వారందరికీ టీకాలు వేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి సోమవారం మెగా టీకా డ్రైవ్ నిర్వహించనున్నట్లు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక డేటా ప్రకారం శనివారం చివరి వరకు, రాష్ట్రంలో 6,07,88,981 డోస్ యాంటీ-కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇవ్వబడింది.