Kurnool, July 29: సరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాలు కూడా తీస్తాయి. ఏపీలోని కర్నూలు (Kurnool) జిల్లాలో జరిగిన తాజా విషాదం ఈ కోవకే వస్తుంది. మద్దికేరకు చెందిన ఓ వ్యక్తి గుర్రపుస్వారీ (Horse Riding) చేస్తూ పొరపాటున కిందపడి మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి గుర్రపు స్వారీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మద్దిరేకరు చెందిన పృథ్వీరాజ్ రాయుడు (28)కి గుర్రపుస్వారీ అంటే చాలా ఇష్టం. తాజాగా ఆయన బీఎన్పేట నుంచి గుర్రపుస్వారీ చేస్తూ వస్తున్నాడు. గుర్రం చాలా స్పీడ్ గా వెళ్తోంది. పక్కనే ఓ వాహనంపై పృథ్వీ స్నేహితుడు ఇదంతా వీడియో రికార్డ్ చేస్తూ అతణ్ని అనుసరిస్తున్నాడు.
ఉచిత బస్సులో ఖాళీగా ప్రయాణించడం ఎందుకని.. బ్రష్ చేసుకున్న మహిళ.. నెట్టింట వీడియో వైరల్
గుర్రంపై నుండి పడి యువకుడు మృతి
కర్నూలు - మద్దికేర మండలంలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ పృథ్విరాజ్ అనే యువకుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. pic.twitter.com/blN3li9NTA
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024
గుర్రం వేగంగా కదలడంతో..
అయితే మార్గమధ్యలో వేగంగా వెళ్తున్న గుర్రంపై పట్టు కోల్పోయిన పృథ్వీ ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. పృథ్వీకి భార్య, ఇద్దరు పిల్లులు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.