
Mumbai, Feb 17: రైలు (Train) ప్రయాణాల్లో జరిగే ప్రమాదాలు, ఆత్మహత్యలకు (Suicide) పాల్పడే వ్యక్తులను కాపాడే సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొంత మంది రైలు దగ్గరికి రాగానే దాని కింద పడి చనిపోయిన వీడియోలు చూశాం. ప్రమాదవశాత్తు రైలు కాలు జారి రైలు కింద పడిపోయే వారిని కాపాడిన వీడియోలూ చూశాం. ఇదీ అలాంటిదే. ముంబైలోని అంధేరీ స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కుదాం అనుకున్న ఓ ప్రయాణికుడు పట్టుతప్పి రైలుకు, ప్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కున్నాడు. అక్కడే ఉన్న ఓ ఆర్పీఎఫ్ పోలీసు మెరుపు వేగంతో స్పందించి చాకచక్యంగా వ్యవహరించి అతన్ని కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
𝕄𝕌𝕄𝔹𝔸𝕀 | "In a heart-stopping rescue, a passenger's life was saved at Mumbai's Andheri Railway Station on Sunday. Quick-thinking Railway Protection Force (RPF) Assistant Sub-Inspector Pawhu Singh sprang into action, pulling a passenger to safety after he fell between the… pic.twitter.com/4GrWs2mrfi
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) February 16, 2025
It's so good to see humans work together for the greater good 🥹 pic.twitter.com/x76Rq3RG60
— Virality Clips (@ViralityClips) January 25, 2025
ప్రాణాలు కాపాడిన సమిష్టి విజ్ఞాపన
రైలు పట్టాలపై పడిన ఓ యువతి తృటిలో ప్రాణాలతో బయట పడిన వీడియో ఒకటి కూడా ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్నది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ఓ మెట్రో స్టేషన్ లో చాలా మంది రైలు కోసం వేచి చూస్తున్నారు. అప్పటికే రైల్వే స్టేషన్ లోకి ట్రైన్ వచ్చేసింది. చాలా మంది రైలు ఎక్కేందుకు ముందుకు వచ్చారు. అప్పుడే ఓ యువకుడు సడెన్ గా ముందున్న యువతిపై పడిపోయాడు. దీంతో ఆమె అమాంతం ఎగిరి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. అప్పటికే రైలు దగ్గరికి వచ్చేసింది. కొంత మంది ప్రయాణీకులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా, రైలు ముందుకు రావడంతో ఎవరూ ట్రాక్ మీదికి దూకే ప్రయత్నం చేయలేదు. అయితే, ప్లాట్ ఫారమ్ మీద ఉన్న వాళ్లంతా రైలు ఆపాలంటూ చేతులలోని బ్యాగులు ఊపుతూ లోకో పైలెట్ ను కోరారు. అతడు పట్టాల మీద పడిపోయిన యువతిని గమనించాడు. ప్రయాణీకుల రిక్వెస్ట్ తో ట్రైన్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి రైలును ఆపాడు. దీంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. ప్రయాణికుల సమిష్టి విజ్ఞాపన ఆమె ప్రాణాలను నిలబెట్టాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పై లింక్ లో మీరూ ఆ వీడియో చూడొచ్చు.