
చిన్న వయసులోనే పిల్లలకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్భయత్వం వంటి లక్షణాలను నేర్పించడం చాలా ముఖ్యము. ఈ గుణాలను వారిలో పెంపొందించడం ద్వారా, వారు భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. అలాగే వ్యక్తిగత, సామాజిక, విద్యా రంగాల్లో విజయవంతమవుతారు. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనుకుంటే, మనం వారి చేత కొన్ని శక్తివంతమైన మంత్రాలను నిత్యం చెప్పించాలి. వీటిని నేర్పించేటప్పుడు, వాటి అర్థాన్ని కూడా వివరించడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల, పిల్లలు కేవలం పదాలను పఠించడమే కాకుండా, వాటి లోతైన ప్రాముఖ్యతను గ్రహించి ధైర్యంగా ఉండగలుగుతారు.
ప్రసిద్ధ సార్వత్రిక మంత్రం “ఓం”. ప్రతి వయస్సు పిల్లలు సులభంగా జపించగల మంత్రం. ఓం మంత్రాన్ని ప్రతిరోజూ జపించడం ద్వారా, వారి మనసులో సానుకూలమైన శక్తులు ప్రవహిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తుంది. శాంతిని అందిస్తుంది. పరీక్షల సమయంలో లేదా కష్ట సమయాల్లో, కేవలం 3-4 నిమిషాల ఓం మంత్ర జపం కూడా పిల్లలకు ధైర్యాన్ని, నిశ్చయతను ఇస్తుంది.
మహామృత్యుంజయ మంత్రం:
ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వరుకమివ బంధనాన్
మృత్యోర్మోక్షీయ మామృతత్
ఈ మంత్రం పిల్లలకు శివుని రక్షణ హామీని ఇస్తుంది. ప్రతి పదం అర్థాన్ని పిల్లలకు వివరించడం ద్వారా, వారు దీని శక్తిని లోతుగా అర్థం చేసుకుంటారు. ఈ మంత్రం ఆరోగ్యాన్ని పెంచడం, భయం తొలగించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
హనుమాన్ చాలీసా.. 40 శ్లోకాల పొడవైనా, పిల్లలలో ధైర్యం, నిర్భయత్వం కలిగించే శక్తివంతమైన మంత్రం. క్రమంగా ప్రతి పంక్తిని అర్థంతో పఠించడం ద్వారా, ఇది పిల్లలకు భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కష్ట సమయాల్లో హనుమంతుడు వారికి సహాయానికి వస్తాడని పిల్లలు నమ్మతారు.
కాళీ దేవి మంత్రం “ఓం శ్రీ మహాకాళికాయై నమః” కూడా భయాన్ని తొలగించి, రక్షణ కల్పిస్తుంది. కష్టాల సమయంలో ఆమె శక్తి పిల్లలను భద్రతగా కాపాడుతుంది. పిల్లలకు ఈ మంత్రాన్ని నేర్పించడం ద్వారా, వారు ధైర్యంతో, సానుకూలతతో ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో నమ్మకాన్ని పొందుతారు.
విష్ణువుకు అంకితం చేసిన మంత్రాలు, ప్రత్యేకంగా వరాహ, మత్స్య, రాముడు వంటి అవతారాల ద్వారా, చెడును తొలగించి, కష్టాలను అధిగమించే శక్తిని అందిస్తాయి. ఈ మంత్రాలను పిల్లలకు నేర్పించడం ద్వారా, వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని పొందుతారు. మంత్రాలు కేవలం పదాలు కాదు; ఇవి పిల్లల మనసులో శక్తి, విశ్వాసం మరియు నిశ్చయతను నింపే సాధనాలు.