Bengaluru, June 23: జేడీఎస్ (JDS) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Suraj Revanna) లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ప్రజ్వల్ సోదరుడు, ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణపై (Suraj Revanna) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. సూరజ్.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడని చేతన్ కేఎస్ అనే జేడీఎస్ యువ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లాకు అరకలగూడుకు చెందిన బాధితుడు దీనికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేశాడు. లోక్ సభ ఎన్నికల సమయంలో తనకు పరిచయమైన సూరజ్ ఫాంహౌస్ కు పిలిచి మాయమాటలు చెప్పి.. వినకపోయేసరికి తనపై దాడికి యత్నించడాని ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువకుడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్య పరీక్షల్లో యువకుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించడం గమనార్హం.
Prajwal Revanna's Brother Suraj Arrested For Allegedly Sexually Assaulting Man https://t.co/7RKHkUJTz5@tmvraghav reports pic.twitter.com/BN1zRjtKPY
— NDTV (@ndtv) June 23, 2024
కేసులో మరో ట్విస్ట్
అయితే, సూరజ్ కు ఈ కేసుతో సంబంధంలేదని, చేతన్ కావాలనే ఈ కేసు పెట్టాడని సూరజ్ అనుచరుడు శివకుమార్ హోళినరిసిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని చేతన్ డిమాండు చేశాడని, ఇవ్వకపోతే లైంగికదాడి చేసినట్టు కేసు పెడతానని సూరజ్ ను బెదిరించినట్టు వెల్లడించాడు. తొలుత ఉద్యోగం కోసం అంటూ నమ్మించిన చేతన్ ఆ తర్వాత సూరజ్ ఫోన్ నంబర్ తీసుకొని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడని ఆరోపించారు. అతడు ఫామ్‌హౌస్ కు వచ్చినప్పుడు పోలీసులతో పాటు చాలా మంది ఉన్నారని పేర్కొన్నాడు. మొదట రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, తర్వాత దానిని రూ.2 కోట్లకు తగ్గించాడని వెల్లడించాడు. దీంతో ఈ పరిణామం ఎటు వెళ్తుందోనన్న ఆసక్తి సర్వత్రా చోటుచేసుకుంది.
తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి