Newdelhi, June 19: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీలోని (Delhi) ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో లగేజీ చెక్ ఇన్ ప్రాసెస్ ఓ పెద్ద ప్రహసనంలా సాగుతుంది. గంటల పాటు వేచి చూడాలి. దీంతో దూర ప్రయాణమంటేనే అందరూ భయపడే పరిస్థితి ఉండేది. దీంతో ప్రయాణికుల సౌలభ్యం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఎయిర్‌పోర్ట్ లో సోమవారం నుంచి ‘సెల్ఫ్ చెక్-ఇన్’ (Self Luggage Check-In) సర్వీసు అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందులా కాకుండా, లగేజ్ చెక్-ఇన్ ను తక్కువ సమయంలో పూర్తి చేసేలా యాభై ‘సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్’ యూనిట్లను విమానాశ్రయంలో ఏర్పాటుచేశారు. ఈ యూనిట్ల వద్ద ప్రయాణికులు తమంతట తామే లగేజ్ చెక్-ఇన్ ను పూర్తిచేయవచ్చు.వాటి ట్యాగ్ లు, బోర్డింగ్ పాస్ లను ప్రింట్ తీసుకొని విమానంలోకి ఎంచక్కా తక్కువ సమయంలోనే చేరిపోవచ్చు. more news here
Self-baggage drop facility launched at Delhi airport, to reduce check-in time#DelhiAirport #Travel | @MunishPandeyy https://t.co/gGtiHDhm0q
— IndiaToday (@IndiaToday) June 19, 2024
కెనడా తర్వాత ఇక్కడే..
సెల్ఫ్ చెక్-ఇన్ వ్యవస్థను తొలుత కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్ట్ లో తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కు దక్కుతుందని నిపుణులు చెప్తున్నారు.