పశువులు వీధుల్లో తిరగడం, ఆలయాల చుట్టూ తిరగటం, రోడ్లపైకి రావడం, అప్పుడప్పుడు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించడం ఇవన్నీ ఇండియాలో ఎక్కడైనా కనిపించే సాధారణ దృశ్యాలు. కొన్ని సార్లు అవి చేసే వింత వింత పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని రోజుల కిందట గోవాలో ఒక ఆవు మనుషులతో పాటు ఫుట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాంటిదే మరో విచిత్రమైన దృశ్యం ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో చోటుచేసుకుంది.
కడప జిల్లాలోని, మైదుకూరు (Mydukur village)లో ఒక ఆవు (Cow) స్థానికంగా ఉండే ఒక బట్టల దుకాణాన్ని ప్రతీరోజు సందర్శిస్తుంది. అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, వచ్చిపోయే వారితో సపర్యలు చేయించుకుంటూ విలాసవంతంగా గడుపుతుంది. ఆవు రాగానే ఆ బట్టల వ్యాపారి కూడా దానిని సాధరంగా లోపలికి ఆహ్వానిస్తున్నాడు. దానికి పూజలు చేస్తూ అక్కడే నునుపైన పరుపుపై విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నాడు. బట్టులు కొనుగోలు చేయడానికి వచ్చే మహిళలు సైతం ఒకవైపు బట్టల సెలెక్షన్ చేసుకుంటూనే, లోపల తిరుగాడుతూ, విశ్రాంతి తీసుకుంటున్న ఆవుకు సపర్యలు చేస్తున్నారు. దానికి సంబంధిచిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఆ వీడియోను మీరూ చూసేయండి.
Cow Visits Cloth Shop in Andhra Pradesh Every Day:
ఈ వింత చూసేందుకు మహిళలు ఆ బట్టల దుకాణానికి భారీగా తరలి వస్తున్నారు. పనిలో పనిగా ఆ దుకాణాదారుడికి కూడా ఈ ఆవు వల్ల మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ బట్టల దుకాణానికి ఈ గోమాత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.
కొన్ని రోజుల కిందట గోవాలో కూడా కొంత మంది యువకులు ఫుట్ బాల్ ఆడుతుండగా మధ్యలో ఒక ఆవు వచ్చింది. ఆ ఫుట్ బాల్ ను అది అందుకొని ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ లాగా దానిని కాలుతో తన్నుతూ ఏకంగా గోల్ చేసింది. ఈ వీడియో కూడా అప్పట్లో పాపులర్ అయింది. ఈ లింక్ ద్వారా దాని విశేషాలు తెలుసుకోవచ్చు.
ఏది ఏమైనా టాలెంట్ మనుషులకే కాదు, రంగంలోకి దిగితే తాము ఎందులో తక్కువ కాదని మూగజీవాలు నిరూపిస్తున్నాయి.