Wedding Pheras In PPE After Groom Tests Covid Positive (Photo-Video Grab)

Bhopal, April 27: కరోనావైరస్ కల్లోలంలో మధ్యప్రదేశ్ లో జరిగిన పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో ఘటన వివరాల్లోకెళితే.. మధ్య ప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతం రట్లం జిల్లాలో పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్నాక వరుడికి కరోనా ( Groom Tests Covid Positive in madhya Pradesh) వచ్చింది. అయితేనేమి పెళ్లిని వాయిదా వేయకుండా అనుకున్న ముహర్తానికే పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు.

వధువు పెళ్లికి ఒప్పుకోవడంతో పీపీఈ కిట్లు వేసుకుని (Wedding Pheras In PPE) ఇద్దరూ ఒకటయ్యీరు. వధువు, వరుడుతోపాటు మరో ముగ్గురు పూర్తి రక్షణ చర‍్యలు తీసుకుని వివాహ కార్యక్రమాన్ని ముగించారు. పీపీఈ కిట్లు, పూలదండలతో హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

డాక్టర్‌పై చేయి చేసుకున్న నర్సు, తిరిగి నర్సుపై చేయి చేసుకున్న డాక్టర్, అసభ్య పదజాలంతో దూషించుకున్న ఇరువురు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రాట్నం తహశీల్దార్‌ గార్గ్‌ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 19న కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో పెళ్లిని ఆపాలని తొలుత ప్రయత్నించారు. కానీ సీనియర్‌ అధికారులు చొరవ తీసుకుని వినూత్నంగా ఆలోచించారు. కరోనా విస్తరించ కుండా, చాలా తక్కువ మందితో పీపీఈ కిట్లతో సోమవారం పెళ్లి ముచ్చటను కాస్తా ముగించారు ఇరు కుటుంబాల వారు. అయితే ఇక్కడో విశేషంకూడా ఉంది. ప్రస్తుతం కరోనా కాలంలో కోవిడ్‌ మార్గదర‍్శకాలను ప్రజలు పాటించేలా ఒక వినూత్న ఐడియాను అధికారులు చేపట్టారు.

Here's Marriage Video

ఇదిలా ఉంటే కేవలం 10 లేదా అంతకంటే తక్కువ అతిథులతో వివాహం చేసుకోబోయే జంటలకు భీంద్ ఎస్‌పీ మనోజ్ కుమార్ సింగ్ (Superintendent of Police Manoj Kumar Singh) బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఈ నూతన దంపతులకు తన ఇంట్లో రుచికరమైన విందు ఇస్తామని ప్రకటించారు.

కరోనా విలయం, బాలాజీకి కొబ్బరికాయ కొట్టండి, ఆయనే అంతా చూసుకుంటాడు, వివాదాస్పదం అవుతున్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఓదార్పు వ్యాఖ్యలు, ట్విట్టర్‌లో వ్యాఖ్యలను సమర్థించుకున్న బీజేపీ సీనియర్ నేత

అంతేకాదు ఆ జంటలకు మెమెంటోలు ఇస్తామన్నారు.కోవిడ్ మార్గదర్శకాలతో వారిని సురక్షితంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి సాగనంపుతామని కూడా వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివాహ కార్యక్రమాలకు గరిష్టంగా 50 మంది​ అతిథులకు మాత్రమే అనుమతి ఉంది.