యూపీలో ఓ డాక్టర్‌, నర్సు ఆస్పత్రిలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ప్రకారం... వైద్యుడికి వద్దకు వచ్చిన నర్సు ఏదో విషయమై ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో విచక్షణ కోల్పోయిన సదరు నర్సు.. డాక్టర్‌పై చేయిచేసుకున్నారు.

ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న డాక్టర్‌ సైతం వెంటనే స్పందించి, ఆమెను తిరిగి కొట్టారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘వారిద్దరితోనూ మాట్లాడాను. తీవ్రమైన ఒత్తిడి, అధిక పనిభారం వల్లే ఇలా చేసినట్లు చెప్పారు. ఏదేమైనా ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తాం’’ అని పేర్కొన్నారు. ఓ పేషెంట్‌కు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)