ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి
ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్‌లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు. వికలాంగులను ఎగతాళి చేస్తూ వీడియో, యువరాజ్‌తో సహా టీమిండియా మాజీ క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు
ఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది.లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది. క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Here's Video
Winning celebrations from Yuvraj Singh, Harbhajan and Raina. 🤣🔥 pic.twitter.com/mgrcnd8GpH
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024
ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.