స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల విలువైన వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. రాయ్‌పూర్‌కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్‌హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి.

కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)