Actress Meena Covid: నటి మీనా కుటుంబం మొత్తానికి కరోనా, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ట్వీట్
కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్ నటి మీనా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా షాకిచ్చారు. ఆమె ట్వీట్ చేస్తూ.. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి
కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్ నటి మీనా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా షాకిచ్చారు. ఆమె ట్వీట్ చేస్తూ.. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దీంతో మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. గెట్‌వెల్ సూన్ మేడం’ అంటూ ఆమె ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా మీనా చివరిగా దృశ్యం 2లో కనిపించారు.
First visitor to my home in 2022, Mr Corona. It liked my entire family. But I'm not letting it stay 😊
Beware people. Please stay safe ND healthy. Be responsible and don't let it spread.
Keep us in your prayers 🙏 #stayhome #beresponsible #dontspread #weareinthistogether pic.twitter.com/sVmXKNLBzO
— Meena Sagar (@Actressmeena16) January 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2022 03:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

