తారక్‌ను పాపులర్ బాలీవుడ్‌ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్‌ కలిశారు. నా అభిమాన వ్యక్తులు, యాక్టర్లలో ఒకరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ను నిన్న రాత్రి కలిశా. ఆయన వర్క్‌ అంటే చాలా ఇష్టం. ఆయన శక్తి నుంచి మహోన్నత శక్తిగా ఎదుగుతూ ఉండు గాక.. జై హో.. అని ట్వీట్ చేశారు అనుపమ్‌ ఖేర్‌.నేనెప్పుడూ ప్రశంసించే అద్భుతమైన వ్యక్తి పనితనం వర్ణనాతీతం. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండి సార్.. అంటూ అనుపమ్‌ ఖేర్‌ పోస్ట్‌కు తారక్ రీట్వీట్ చేశాడు. ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో తారక్ బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం వార్‌ 2 షూటింగ్ కోసం ముంబైలో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో తారక్‌ నటిస్తోన్న దేవర మూవీ రెండు పార్టులుగా రానుంది. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. సైఫ్‌ అలీఖాన్‌, ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)