హీరో విక్రమ్ ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే, విక్రమ్ కు గుండెపోటు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పటికే దీనిపై ఆయన మేనేజర్ వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో, చెన్నైలో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది. విక్రమ్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల చేసింది. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో విక్రమ్ తమ ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడించింది. విక్రమ్ ను నిపుణులైన తమ ఆసుపత్రి వైద్యుల బృందం పరీక్షించిందని, అవసరమైన వైద్యం అందించిందని తెలిపింది. విక్రమ్ కు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలేవీ లేవని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించింది. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని కావేరీ ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది.

Vikram Health Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)