మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ.. కరోనా బారిన పడ్డాను. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో కనిపించడంతో.. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. త్వరలోనే మీ అందరిని తిరిగి కలుస్తా’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)