టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖ సినీనటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోయారు. దీంతో ఈడీ అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు.

ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా ఈడీ అధికారులు రకుల్‌కు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై 2017 జులైలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్‌ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు.గతేడాది సెప్టెంబర్‌లో మనీలాండరింగ్‌ కింద ఈ కేసులో ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)