సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తరువాత మహేష్ సినిమా వస్తుండటంతో.. అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. పరుశురామ్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ‘కళావతి’ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

మహేష్ బాబు, హీరోయిన్ కీర్తిసురేష్ పై ఈ సాంగ్ చిత్రీకరించారు. ఈసాంగ్ లో మహేష్ బాబు- కీర్తి సురేష్ పెయిర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాగా ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. విడుదలైన ఒక్క రోజులోనే 1,13,43,580 వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో 6.9 LAKH మంది లైక్స్ కొట్టారు. 69,673 Comments వచ్చాయి సిడ్ శ్రీరాం సూపర్ వాయిస్, తమన్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేశాయి. ఇక సినిమా విడుదలైతే మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో అని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)