ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61)  ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కేరళకు చెందిన సంగీత్ శివన్.. 1990లో 'వ్యూహం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యోధ, గంధర్వం, నిర్ణయం, స్నేహపూర్వం అన్న లాంటి మలయాళ సినిమాలతో పాటు అప్నా సప్నా మనీ మనీ, క్లిక్, యమ్ల పగ్ల దీవానా 2 తదితర హిందీ మూవీస్ చేశారు. చివరగా 2019లో 'భారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. సంగీత్ శివన్ చనిపోయారని వార్త తెలిసిన తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మలయాళ, హిందీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)