మార్చి 12న ఆస్కార్‌ అవార్డుల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అమెరికాకు వెళ్లాడు. ఈ కార్యక్రమానికి సూమారు 20 రోజులు ముందుగానే రామ్‌ చరణ్‌ అమెరికాకు వెళ్లడం గమనార్హం.ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. దాని కోసమే చిత్ర యూనిట్‌ అమెరికాకు ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్‌, రాజమౌళి కూడా అమెరికాకు వెళ్లనున్నారట. ప్రస్తుతం రాంచరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. స్వామి మాలలోనే ఆయన అమెరికాకు వెళ్లాడు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)