ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) పై మహిళా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. వైస్‌ఛాన్స్‌లర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై వర్మ రివర్స్ అటాక్ చేశారు. లాయర్లు తనపై ఫిర్యాదు చేయడంపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తనను కించపరుస్తూ.. తన మనోభావాలను గాయపరిచిన ఈ అడ్వకేట్లందరిపై కేసు పెట్టబోతున్నాను అన్నారు. యూనివర్సిటీలోని స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్లకి తాను మాట్లాడిన దాంట్లో ప్రాబ్లమ్ అనిపించలేదని.. ఊరు, పేరు, పని పాటలేని వాళ్లకి మాత్రం పబ్లిసిటీ పాకులాట.. ఫోటోలో వాళ్ల నవ్వులు చూడండి అంటూ మండిపడ్డారు.

కాగా వర్శిటీ ‘అకడమిక్‌ ఎగ్జిబిషన్‌ 2023’కు ముఖ్య అతిథిగా ఆర్జీవీ వెళ్లారు. విద్యార్థులు నచ్చింది తిని, కావాల్సినంత తాగి, ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయాలన్నారు వర్మ. తాను తన కోసమే బ్రతుకుతానని.. తాను చనిపోయాక ఈ ప్రపంచం ఏమైనా తనకు అనవసరమన్నారు.. ఇలా మరికొన్ని కామెంట్స్ చేశారు.

Here's Varma Tweets

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)