బానిసలుగా మారకండి అంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్ లో చేసిన పోస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ పై వర్మ స్పందిస్తూ.. బానిసలుగా మారకండి అన్నారు బావుంది. కానీ సార్... 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పే వ్యక్తి నుంచి చివరికి వచ్చేది బానిసత్వమేనని మీకు అనిపించలేదా? ఆ రెండు లక్షల పుస్తకాల నుంచి అతడు ఏం నేర్చుకోలేదో, అంతకు మించి అతడు ఆలోచించలేడని అర్థమవుతోంది. కానీ అజ్ఞానులైన అభిమానులందరూ అతడొక మహా జ్ఞాని అని నమ్ముతారు. కానీ వాళ్లందరూ తనను జ్ఞాని అని అందుకు అనుకుంటున్నారో అని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా అతడికి లేదు... ఎందుకంటే అతడు నికార్సయిన అజ్ఞాని కాబట్టి" అంటూ వర్మ పేర్కొన్నారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)